విజయం అంకుల్ గారిని మొట్టమొదటి సారిగా

విజయం అంకుల్ గారిని మొట్టమొదటి సారిగా 2011 లో TENT కేంపస్ లో చూసినపుడే ఆయన సౌమ్యత, ప్రేమ, తగ్గింపులు నన్ను బాగా inspire చేసాయి. అంకుల్ కు దేవుడు ఇచ్చిన దర్శనం విన్న తరువాత ఆయన పరిచర్యలో నేను కూడా పాలిభాగస్తుణ్ణవ్వాలనే ఆశ నాలో పుట్టింది. ఆ ఆశను తీర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన పని ఏమిటంటే – In the presence of the poor అనే శీర్షికతో వ్రాయబడిన Uncle గారి జీవిత చరిత్ర పుస్తకాన్ని English నుండి Telugu లోనికి తర్జుమా చేయడం. అయితే ఆ పని పూర్తి చేయడానికి నేను 2 సంవత్సరాల టైమ్ తీసుకున్నాను. అది “పేదల పెన్నిధి” అనే శీర్షికతో OM వారి ద్వారా పబ్లిష్ అయినప్పుడు నేను ప్రభువు నందు బహుగా సంతోషించి దేవుణ్ణి మహిమ పరిచాను. ఆ తరువాత నా కుమారుణ్ణి TENT లో ట్రెయినింగ్ కు పంపించాను. బాబు దర్శన్ ఇప్పుడు నాకు పరిచర్యలో కుడి భుజంగా ఉండి ఎంతో సహాయం చేస్తున్నాడు. TENT బాబును అలా మలిచింది కాబట్టి నేను TENT ministries కు ఎప్పటికీ కృతజ్ఞుణ్ణయి ఉంటాను.

-పాస్టర్ షాలేమ్ ఇశ్రాయేల్ అరసవెల్లి, డైరెక్టర్, జీవజలములు రేడియో & మీడియా పరిచర్యలు, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్
9700006565